9, అక్టోబర్ 2012, మంగళవారం

రామాయణంలోని సంఘటనలు-వాటి కాల నిర్ణయం.ఇంతకు ముందు పోస్టు శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు లో శ్రీ రామ జననం గురించి తెలుసు కున్నాం కదా? ఇప్పుడు రామాయణంలో మరికొన్ని సంఘటనలు ఎప్పుడు జరిగాయో తెలుసు కుందాం.
శ్రీ వాల్మీకి మహర్షి  రామాయణంలో అయోధ్య కాండలో చెప్పిన దాని ప్రకారం దశరధమహారాజు మీన లగ్నంలో రేవతీ నక్షత్రంలో జన్మించాడు. తన జన్మ నక్షత్రాన్ని రవి, కుజుడు,రాహువు చుట్టుముట్టి ప్రభావితం చేసినప్పుడు తనకు మరణం సంభవించడమో  లేక ఏదైనా కుట్రకు బలి కావడమో జరుగుతుందని భయపడే వాడట.అందు చేత అటువంటి సమయం సమీపించగానే తొందరపడి శ్రీరామునికి పట్టాబిషేకం తలపెట్టాడు.కాని విధినెవ్వరు తప్పించగలరు? పట్టాభిషేకం జరుగక పోగా.శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. పైన చెప్పిన నక్షత్ర, గ్రహరాశుల స్థితిగతులను Planetarium gold Soft ware ఉపయోగించి కంప్యుటర్ ద్వారా పరిశీలించి అది సరిగా 5th జనవరి క్రీ.పూ.5089 వతేదీ అని మన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. శ్రీ రాముడు క్రీ. పూ.5114 జనవరి 10 వతేదీన పుట్టాడని ఇంతకుముందు తెలుసు కున్నాం కనుక శ్రీ రాముడు అరణ్య వాసానికి బయలుదేరేనాటికి ఆయన వయస్సు25  సంవత్సరాలని తేలింది.
రామాయణంలో వాల్మీకి ఆయా సమయాల్లో  వర్ణించిన గ్రహస్థితులను బట్టి రామాయణంలోని మరికొన్ని సంఘటనలు జరిగిన తేదీలను కూడా నిర్ధారించారు.అవి కూడా తెలుసు కుందాం.
శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ళ వనవాసంలో పదమూడవ యేడాది లో ఖరదూషణులనే రాక్షసులను సంహరించి నట్లు వాల్మీకి చెప్పాడు.ఆదినం అమావాస్య అనీ కుజుడు సరిగా గ్రహాల మధ్యస్థానంలో ఉన్నాడని  చెప్పాడు. మరో ముఖ్య విషయం ఆ రోజు సూర్య గ్రహణం కూడా ఉందనీ తెలిపాడు. ఈ వివరాలను బట్టి కంప్యుటర్ సాయంతో అది 7th జనవరి క్రీ.పూ. 5077 అని  మన శాస్త్రజ్ఞులు నిర్ధారించారు
కిష్కింద కాండలో వాలిని శ్రీరాముడు చంపినప్పుడు సూర్య గ్రహణం ఉందని  వాల్మీకి పేర్కొన్నాడు.3Rd ఏప్రియల్ క్రీ.పూ.5076 నాడు సూర్య గ్రహణం ఉందనీ ఆసంవత్సరం అదొక్కటే సూర్యగ్రహణమనీ అందు చేత రాముడు వాలిని చంపిన రోజు అదేననీ మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
మరొక విషయం. హనుమంతుడు లంకలో అశోక వాటికలో సీతమ్మ వారిని కనుగొన్నప్పుడు చంద్రగ్రహణం ఉందని వాల్మీకి చెప్పాడు. కంప్యుటర్ చెప్పిన దానిప్రకారం 12thసెప్టెంబరు క్రీ.పూ. 5076 నాడు సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో మొదలైన చంద్ర గ్రహణం సింహళ దేశం లో కనిపించేదిగా ఉందట.
ఇదే కాదు హనుమంతుడు తన తిరుగు ప్రయాణం చేసినప్పుడు ఉన్న గ్రహస్థితులను బట్టి ఆరోజు 14thసెప్టెంబరు క్రీ.పూ.5076 గా గుర్తించారు.
వాల్మీకి రామాయణంలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే రావణ వధ క్రీ.పూ .5076 సంవత్సరం డిశంబరు 4వ తేదీ అని తేలుతోందట. శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ల వనవాసాన్ని క్రీ.పూ.5075 జనవరి 2వతేదీన పూర్తి చేసుకున్నాడనీ ఆరోజు కూడా చైత్రమాసంలో శుక్ల పక్ష నవమి అయిందనీ ఆ విధంగా శ్రీ రాముడు తిరిగి అయోధ్యా ప్రవేశం చేసే నాటికి ఆయనకు 39 ఏళ్ళనీ మన శాస్త్రజ్ఞులు తేల్చారు.  వాల్మీకి రామాయణం కూడా ఇదే చెబుతోంది.
శ్రీ రాముని జన్మదినంగా తాము పేర్కొన్న క్రీ.పూ.5114 జనవరి 10వ తేదీ లగాయతూ వరుసక్రమంలో రామాయణంలో జరిగాయని చెప్పబడుతున్నముఖ్యమైన సంఘటనల తేదీలూ,  రామాయణంలో వాల్మీకి చెప్పిన నక్షత్ర గ్రహరాశుల స్థానాలూ అన్నీ ఒకదానికకటి సరిపోవడాన్ని కేవలం యాదృఛ్చికమని భావించడానికి వీలులేదంటారు మన శాస్త్రజ్ఞులు.
శ్రీ రామకథ లోని సంఘటనలు ఏ ఏ తేదీలలో జరిగాయో తెలుసుకున్నాం. శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ల వనవాసంలో ఏఏ ప్రాంతాలలో తిరుగాడేడో ఏం చేసాడో మరో సారి చెప్పుకుందాం.
                                                                          ***
(ఇంతకు ముందే నేను చెప్పినట్లు ఈ  పరిశోధన చేసి ఫలితాలను ప్రకటించిన వారు Institute of Scientific research on Vedas వారు.వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం.)
                                                                                             ***

3 వ్యాఖ్యలు:

శశి చెప్పారు...

I have obe doubt, as per puranas the treta yuga is about 4lkhs yrs , then how come the time you have given in the post is just about 7000 yrs. Could you clarify

Pantula gopala krishna rao చెప్పారు...

శశిగారూ,మీ అనుమానం సరైనదే.ధీనికి ముందు నేను వ్రాసిన శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు అనే పోస్టు చదవండి.దానిలోనే నాలాంటి వాడికెవరికైనా ఇటువంటి అనుమానం వస్తుందని వ్రాసేను.త్రేతాయుగానికీ మన కలియుగానికీ మధ్య ద్వాపరయుగం (కొన్ని లక్షల సంవత్సరాలు)కూడా ఉంది.అయితే పురాణాలకీ చరిత్రకీ ఉండే తేడాని మనం దృష్టిలో పెట్టుకోవాలి.పురాణాలని మనవాళ్లే పుక్కిట పురాణాలని అన్నారు.అంటే జనశృతిలోఅలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట.వేలూ లక్షలూ సంవత్సరాల పాటు జనం నోళ్లలో నలిగిన గాథలు ఎన్నో మార్పులు చేర్పులూ చెందడం సహజం.పురాణాలని నమ్ముతామా?శాస్త్ర్రీయంగా పరిశోధించి చెప్పిన విషయాలను నమ్ముతామా?అన్నది మన ఇష్టం.ఈ రెండూ నమ్మని వారు కూడా లోకంలోచాలామందే ఉంటారని నానమ్మకం.ఎవరి నమ్మకాలువారివి.ఎవరి నమ్మకాలనూ కాదనో ఔననో అనడం నాఉద్దేశం కాదు.శాస్త్ర్రీయ పరిశోధనలు వెల్లడించిన విషయాలను జనం దృష్టికి తేవడమే నా లక్ష్యం.

kastephale చెప్పారు...

చాలా గొప్ప విషయాలని పంచుకున్నారు. ఇది తెలుసుకోగలగడం నిజంగా అదృష్టమే.