26, ఆగస్టు 2013, సోమవారం

కందాలూ ... మకరందాలూ ...

నా కందాలూ ... మకరందాలూ ... పుస్తక రూపంలో ఇక్కడ చదవండి. మీ అభిప్రాయం తెలియ జేస్తారు కదూ ?

7 వ్యాఖ్యలు:

పంతుల జోగారావు చెప్పారు...

మీ కందాలూ ... మకరందాలూ ... చక్కని పుస్తక రూపంలో మాకు అందించినందుకు మీకు నా అభినందనలు. పద్యాలన్నీ చాలా సొగసుగా ఉన్నాయి. మంచి ధారతో ఎక్కడా పని కట్టుకొని పద్యం రాసినట్టుగా అనిపించ లేదు. ఆ సాయినాథుని కృప మీ పై అనవరతం ఉండాలని ఆశిస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

పద్యాలన్నీ చదివేశానండీ.నాకు పద్యం రాయడం రాదుకాని చదవగలను. మొత్తానికి ఎవరినీ వదిలిపెట్టలేదు :) పద్యాలు బాగున్నాయి.ఇంగ్లీషు మాటలు కూడా సింపుల్ గా తెలుగు చేసేసేరు.

అజ్ఞాత చెప్పారు...

అన్నట్టు మరచా రెండురోజులనుంచి మీ టపా చూడాలంటే కనపడలేదు. ఈ రోజు కనపడింది. మరో మాట, కందం రాసినవాడే కవి, పందిని పొడిచినవాడే బంటూ అని సామెత కదా!మీ కందాలు మకరందాలతో అందంగా వున్నాయండోయ్!

శ్యామలీయం చెప్పారు...

మీ‌ కందాలు బాగున్నాయి.

( కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న సవరణలు అవసరం పడుతున్నాయి.)
అభ్యాసం చేయండి. తప్పక మరింత ప్రౌఢంగా వ్రాయగలుగుతారు.

Pantula gopala krishna rao చెప్పారు...

నా కంద పద్యాలను చదివి స్పందించిన శ్రీ కష్టేపలే శర్మ, పంజో, శ్యామలరావు గార్లకు కృతజ్ఞతలు.
శ్యామలరావుగారూ,ఈ రోజుల్లో పద్యాలే ఎవరికీ అక్కర లేదు, ప్రౌఢమైన పద్యాలెవరిక్కావాలి.అందుచేత నేను సరదాగా వ్రాసుకున్న పద్యాల్లో గ్రాంథికానికి బదులు శిష్ట వ్యావహారికమే వాడేను.చాటువుల్లాంటి ముక్తకాల్లో ఆ భాషే రాణిస్తుందని నా నమ్మకం. గణదోషాలేవైనా మీ కళ్ళబడితే చెప్పండి, సవరించుకుంటాను.మరోసారి మీకు నా కృతజ్ఞతలు.

శ్యామలీయం చెప్పారు...

గోపాలకృష్ణారావుగారూ

నేను ప్రౌఢం అన్నది జటిలగ్రాంథికం అన్న అర్థంలో కాదు. మరింత ధారాశుధ్ధితో అన్న ఉద్దేశంతో‌ మాత్రమే. గ్రాంథికం కుప్పిస్తే ఎవరూ చదవరు నిజమే.

దయచేసి నాకు మీ email id ఇవ్వండి.
నాకు ఏమన్నా గణదోషాది సవరణలు అవసరం అనిపిస్తే తెలియ జేయటానికి వీలుగా ఉంటుంది

Pantula gopala krishna rao చెప్పారు...

శ్యామలరావుగారూ, నా email id pantulagk@gmail.com మీ వంటి పండితుల సలహాలెప్పుడూ నాకు శిరోధార్యమే.